నమస్కారం!
నా పేరు డా. ఏ. సత్యనారాయణ రావు. గత 43 సంవత్సరాలు అయి ఢిల్లీ లో Safdarjung hospital మరియు డా. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో పని చేసి రిటైర్ అయ్యాను. నేను సర్జరీ విభాగం లో పరామర్శ దాత ఇంకా ప్రొఫెసర్ గా పని చేశాను. ప్రస్తుతం నేను ఉత్తరాఖండ్ లో టిహిరి జిల్లా హాస్పిటల్ లో పని చేస్తున్నాను.
మీరు కరోనా కి ఓడించాలి అంటే అందరూ వాక్సిన్ వేసుకోవాలి. మీ అందరికీ నా వినమ్ర నివేదన ఏంటి అంటే మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ వాక్సిన్ పుచ్చుకోవలను.
ఈ సందేశం Oxfam India సంస్థ ద్వారా ప్రకటింప బడినది.
ఈ వాక్సిన్ వైజఞానికంగా పరీక్షింప బడినది. ఈ వాక్సిన్ చాలా సురక్షితం మరియు ఉపయోగకరం అయినది. నేను కూడా ఈ వాక్సిన్ పుచ్చు కున్న తర్వాత కూడా హాస్పిటల్ లో పని చేయ గలుగు తున్నాను. ఈ వాక్సిన్ వలన మన శరీరం లో కరోనా రోగం వచ్చినాకూడా అంత భయంకరంగా ఉండదు మరియు ప్రాణ భయం కూడా తగ్గుతుంది.
ఈ వాక్సిన్ రెండు మోతాదులు వేసుకోవాలి. ఈ వాక్సిన్ వేసుకున్నా కూడా అన్ని జాగ్రత్తలు అనగా - రెండు మాస్కులు వాడటం, చేతులు సబ్బుతో శుభ్రంగా కడగటం లేదా sanitizer వాడటం మరి మనుషులు తో దూరంగా ఉండటం చేస్తూనే ఉండాలి. ఈ వాక్సిన్ వేసుకున్న తర్వాత కొంచం చెయ్య నొప్పి, శరీరంలో నొప్పి, జ్వరం రావచ్చు, మందు తో ఇది తగ్గిపోతుంది. ఐనప్పటికీ ఇంకా ఏమైనా బాధలు ఉంటే వాక్సిన్ వేసినవాళ్లు వెంటనే పరిష్కారం చెపుతారు.
అందువలనే మీరందరూ వాక్సిన్ పుచ్చుకొండి, కరోనా కి తరిమి కొట్టండి. జై హింద్!